Sunday, February 1, 2009

మా బుజ్జి కోసం

మా బుజ్జి కోసం పుట్టిన భామా
ఎక్కడే ... నీ చిరునామా ...? ..మా బుజ్జి..

నీ కోసమే మావాడి ఎదురుచూపులు
నీ కోసమే మా 'వాడి' ఎదురు
చూపులు
నువ్వు కనపడితే చాలు అవే పెళ్లి చూపులు
నీ మౌనాలే అర్దాంగీకారాలు...
నువ్వు ఊఁ అంటే చాలు, మ్రోగు పెళ్లి బాజాలు ... ..మా బుజ్జి..

ఏలూరు నెల్లూరు ఎక్కడుంది మీ ఊరు
నెట్ లో పట్టేస్తే,
తప్పించుకోలేరు
ఎన్నాళ్ళు ఈ బెట్టు, ఆపు నీ కనికట్టు
మా బుజ్జిగాడే నీకు పెర్ఫెక్టు... ..మా బుజ్జి..

Wednesday, December 31, 2008

కునుకే బంగారమాయెనా ?

కునుకే బంగారమాయెనా ... వెంకన్న స్వామికి
కునుకే బంగారమాయెనా...
కునుకే బంగారమాయె... నిద్దురే కరువైపోయే
కనులారా భక్తుల గాచే... కలియుగ దైవానికి ఇలలో ..కునుకే..


కలియుగ దైవమ్మని ... కరుణా మూర్తివి నీవని
తలచే నీ భక్తుల కోర్కెలు... తీర్చే నీ చల్లని చూపుకు ..కునుకే..


రెండున్నరకు పవళింపు సేవ... మూడు గంట్లకే సుప్రభాతము
అర గంటలో అలమేల్ మంగ అలకలు తీర్చి వచ్చే స్వామికి ..కునుకే..


ఏడు కొండల వాడా ... వడ్డీ కాసుల వాడా
లక్ష్మి నాధుడా నీకు ... కాసుల రాసుల మధ్య ..కునుకే..